Personal Loan: మనలో చాలామంది పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగం, స్థిర ఆదాయం లేనివాళ్లు పర్సనల్ లోన్ తీసుకోవడం సులభం కాదు. నెలనెలా జీతం వచ్చేవాళ్లకు మాత్రమే పర్సనల్ లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే కచ్చితంగా ఆదాయానికి సంబంధించిన రుజువులు తీసుకోవాలి. కొలేటరల్ సెక్యూరిటీని చూపించడం, గ్యారెంటార్ గురించి కూడా బ్యాంకులు పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తిని అడుగుతాయి.
ఉద్యోగం లేనివాళ్లు ఏదో ఒక రకమైన హామీని అందించడం ద్వారా పర్సనల్ లోన్ ను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. రుణం పొందడానికి పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్, ఆధార్ కార్డ్, యాక్టివ్ బ్యాంక్ ఖాతా వివరాలను కూడా అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగం లేనివాళ్లు తల్లిదండ్రులను సహ రుణగ్రహీతగా చేయడం ద్వారా సులభంగా లోన్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీ.. ఎలా అంటే?
రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలామంది డిజిటల్ లెండింగ్ యాప్ ల సహాయంతో లోన్ తీసుకుంటున్నారు. అయితే ఈ యాప్ ల వల్ల కూడా లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఈ యాప్ ల ద్వారా లోన్ తీసుకుంటే ఎక్కువ మొత్తం వడ్డీ రూపంలో పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఖాతాలో ఎక్కువ మొత్తంలో బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటే కూడా లోన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే అవసరానికి లోన్ తీసుకుంటే మంచిది తప్ప అనవసర ఖర్చుల కోసం లోన్ తీసుకున్నా నష్టం తప్పదని చెప్పవచ్చు.
Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. 35 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్!