
ఎన్టీఆర్, వైఎస్సార్, సావిత్రి లాంటి ప్రముఖుల బయోపిక్స్ ఇప్పటివరకు చూశాం. యాత్ర సినిమా పేరిట వైఎస్సార్ బయోపిక్ తీసిన దర్శకుడు మహి వి రాఘవ.. యాత్ర–2కి సిద్ధమయ్యాడట. యాత్ర మూవీ అతనికి మంచి పేరును తీసుకొచ్చింది.
Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?
వైఎస్‌ఆర్ జీవిత కథతో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఆ చిత్రం తర్వాత మహి వి రాఘవ ఇప్పటివరకు ఏ చిత్రం చేయలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు సాగిన జీవిత కథతో ‘యాత్ర 2’ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నట్లుగా ఆయన చెబుతూ వస్తున్నాడు. ప్రస్తుతంస్ర్కిప్ట్ రెడీ అయినట్లుగా సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ఓ ప్రముఖ స్టార్ హీరో జగన్ పాత్రను చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
యాత్ర వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా.. ఆయన సీఎం అయ్యే వరకు దర్శకుడు నిర్మించారు. ‘యాత్ర–2’ సినిమా జగన్ సీఎం అయ్యే వరకు తీస్తున్నాడట. అయితే.. జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాలో నటించేది వైఎస్సార్‌ను అమితంగా అభిమానించే కింగ్ నాగార్జున అంట.
ప్రస్తుతం బిగ్‌బాస్ 4 సీజన్‌లో హోస్ట్‌గా చేస్తున్న కింగ్ నాగార్జున యాత్ర–2లో యాక్ట్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఒకవేళ అదే నిజమైతే ఈ చిత్రంపై భారీగా క్రేజ్ ఏర్పడటం ఖాయం.
Also Read : మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?