Ugadi
Ugadi Festival: తెలుగు సంవత్సరాది ఉగాది 2025 మార్చి 20న రాబోతుంది. వసంత రుతువు ఆరంభంలో.. చెట్టు చిగురిస్తున్న సమయంలో ఉగాది పండుగను నిర్వహించుకుంటారు. సాధారణంగా మనకు సంవత్సరం ప్రారంభం అనగానే జనవరి ఒకటి గురించి చెప్పుకుంటూ ఉంటాం. కానీ తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. యుగం అంటే సంవత్సరం.. ఆది అంటే మొదలు.. అంటే ఉగాది అంటే కొత్త సంవత్సరం. తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం మొదటి నెల కాగా.. పాల్గొనమాసం చివరి నెల. దీని ప్రకారమే పంచాంగం తయారవుతుంది. ఆ పంచాంగం ప్రకారమే జ్యోతిష శాస్త్రం నిర్వహించబడుతుంది. అయితే ఉగాది పండుగ ఎలా వచ్చింది? ఈ పండుగ విశిష్టత ఏంటిది?
ఉగాది పండుగ గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుషు ఉగాది రోజే ప్రారంభమైందని చెబుతున్నారు. మరికొందరు చైత్ర శుద్ధ పాడ్యమి మాడే కలియుగ మొదలైందని అంటుంటారు. శ్రీరాముడికి పట్టాభిషేకం ఉగాది రోజే జరిగిందని పేర్కొంటారు. బ్రహ్మదేవుడు సృష్టి ఉగాది నాడే ప్రారంభమైందని తెలుపుతారు. శాలి వాహనుడు ఉగాది రోజే సింహాసనాన్ని అధిష్టించి పాలన ప్రారంభించారని చరిత్ర తెలుపుతుంది.
ఎవరు ఎలా చెప్పినా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుంచి ఉగాది పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ సమయంలో శాలివాహనులు ఉగాది పండుగను ప్రారంభించినట్లు చరిత్ర తెలుపుతోంది. ఉగాది పండుగ ప్రకృతితో మమేకమై ఉంటుంది. ప్రకృతిలో కొత్త వాతావరణం ఏర్పడినప్పుడు వసంత ఋతువు అని అంటారు. ఇప్పటినుంచే ఏడాది పాటు రకరకాల కాలాలు వస్తాయని చెబుతారు. వసంత రుతువులో చెట్లు చిగురిస్తాయి. చెట్లకు కొత్త పూలు వస్తాయి. అందువల్ల ఉగాదిని ఆరంభం సంవత్సరం అని అంటారు.
ఉగాది పండుగకు ప్రత్యేక విశిష్టత ఉంది.. ఈరోజు అందరూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఉగాది రోజున 6 రుచులు కలిపిన పచ్చడని సేవిస్తూ ఉంటారు. ఈ ఆరు రుచులు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు.. భవిష్యత్తులో వచ్చే కష్టసుఖాలను గురించి తెలియజేస్తాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఆరు రుచులు కలిసిన పానీయం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతోందని సైన్స్ తెలుపుతుంది. ఈ పచ్చడికి ప్రత్యేక విశిష్టత ఉన్నందువలనే ప్రతి ఇంట్లో దీనిని తయారు చేసుకుంటారు. గ్రామాల్లో పట్టణాల్లో దీనిని పంపిణీ చేస్తారు. కొత్త కుండలో తయారుచేసిన పచ్చడి.. కొత్త రుచిలు కలిగి ఉంటుంది.
ఉగాది రోజు మరో విశేషం ఏంటంటే పంచాంగ శ్రవణం. ఉగాది నుంచి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. దీనిని బట్టి ఒక వ్యక్తి వచ్చే ఏడాదిలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చా? లేదా అనేది తెలుసుకోవచ్చు? భవిష్యత్తులో ఏదైనా ఆపద వస్తుందని తెలిస్తే.. ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అలాగే వివాహం ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేవారు.. ఏ సమయంలో నిర్వహించుకుంటే మంచిది.. అనే విషయాన్ని ఈ పంచాంగం తెలుపుతుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ప్రధాన క్రీడలలో చెప్పే పంచాంగాన్ని వింటారు. అలాగే ఉగాది రోజు రకరకాల పిండి వంటలు చేసుకుంటూ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.