spot_img
Homeక్రీడలుక్రికెట్‌Heinrich Klaasen: హెడ్ కాదు.. అభిషేక్ అంతకంటే కాదు.. సన్ రైజర్స్ కు కాటేరమ్మ కొడుకు...

Heinrich Klaasen: హెడ్ కాదు.. అభిషేక్ అంతకంటే కాదు.. సన్ రైజర్స్ కు కాటేరమ్మ కొడుకు ఇతడే

Heinrich Klaasen: క్లాస్ రూమ్ లో టీచర్ అడిగిన ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారు. పరీక్షల్లో సరైన సమాధానం రాసినవారే టాపర్ అవుతారు. ఈ సూత్రం ఇతడికి నోటికి నూరు శాతం కాదు కోటి శాతం వర్తిస్తుంది. టి20 క్రికెట్లో ఎప్పుడు ఎలా ఆడాలో.. ఏ బౌలర్ మీద ఎలాంటి ప్రభావం చూపించాలో.. బహుశా ఇతడికి తెలిసినట్టు ఏ ఆటగాడికి కూడా తెలియదు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు మూల స్తంభంగా క్లాసెన్ పేరు గడించాడు. అతడు దూకుడుగా ఆడుతాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తాడు. చెత్త బంతులను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాడు. మంచి పంతులకు విపరీతమైన గౌరవం ఇస్తాడు. బౌలర్ ఇబ్బంది పెడితే సరెండర్ కాకుండా, అతని ముందు తగ్గినట్టు కనిపిస్తాడు. బౌలర్ ఎవరైనా తప్పు చేస్తే మొహమాటం లేకుండా శిక్షిస్తాడు. అందువల్లే అతడు కాటేరమ్మ కొడుకు అయ్యాడు.

హైదరాబాద్ జట్టు గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో సత్తా చూపించింది అంటే దానికి ప్రధాన కారణం క్లాసెన్. ఎందుకంటే వరుసగా హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, అనికేత్ అవుట్ కావడంతో.. హైదరాబాద్ జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఒకానొక దశలో 250 నుంచి పరుగులు చేస్తుందనుకుంటున్న క్రమంలో.. దారుణంగా తడబడింది.

ఈ దశలో వచ్చాడు క్లాసెన్. వచ్చి రాగానే వేగాన్ని నమ్ముకోకుండా.. నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత తన పరాక్రమాన్ని చూపించాడు.. తద్వారా హైదరాబాద్ జట్టులో తనను ఎందుకు మూల స్తంభం అని పిలుస్తారో నిరూపించాడు. 2024 లో 29 బంతుల్లోనే 63.. 2025లో 35 బంతుల్లోనే 105.. 2026 లో 35 బంతుల్లో 52.. పరుగులు చేశాడంటే అతడి స్టామినా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్లాసెన్ సన్ రైజర్స్ జట్టుకు ప్రతి సందర్భంలో ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. బ్యాటింగ్ పరంగా చాలావరకు జట్టు భారాన్ని అతడేమో వస్తున్నాడు. అందువల్లే కావ్య అతడిని జట్టులో కొనసాగిస్తోంది. కొన్ని సందర్భాలలో విఫలమైనప్పటికీ.. ఎక్కువ సందర్భాలలో అతడు సత్తా చూపిస్తున్నాడు. హైదరాబాద్ జట్టు నిన్నటి మ్యాచ్లో తీవ్రంగా ఇబ్బంది పడింది. మెరుగైన ఆరంభం లభించినప్పటికీ.. ఆ తర్వాత కోల్ కతా బౌలర్ల ముందు తలవంచింది. ఈ దశలో క్లాసెన్ రంగంలో దిగి.. సీన్ మొత్తం మార్చేశాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి సంచలన భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు 200+ స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్లో హెడ్, అభిషేక్ శర్మ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ కంటే.. క్లాసెన్ చేసిన పరుగులకే ఎక్కువ వేల్యూ ఉందంటే.. అతడి బ్యాటింగ్.. అతడి స్టామినాను అర్థం చేసుకోవచ్చు.

క్లాసెన్ ఇలా ఆడినా పర్వాలేదు. ఇలా ఆడితే మాత్రం హైదరాబాద్ జట్టుకు తిరుగుండదు. ఎందుకంటే అతడు ఇప్పుడు నిజమైన కాటే రమ్మ కొడుకు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular