
వైసీపీ ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత దోచుకోవాలనే దానిపై దృష్టి పెట్టి అధికారాన్ని వ్యాపారంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరుగుతన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర నిధులే అని సోము వీర్రాజు తెలిపారు. ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న సంస్థాగత సమావేశాలలో భాగంగా, ఈరోజు ఏలూరు పార్లమెంటు జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి మాలతీరాణి, రాష్ట్ర ప్రధాన కర్యదర్శి లోకుల గాంధీ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్, జిల్లా అధ్యక్షులు సుధాకర్ కృష్ణ పాల్గొన్నారు.