https://oktelugu.com/

F3 Movie: మెహరీన్ పుట్టిన రోజు కానుకగా… ఎఫ్ 3 మూవీ టీమ్ స్పెషల్ గిఫ్ట్

F3 Movie: “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. మొదటి చిత్రంతోనే మంచి హిట్ సాధించిన ఈ భామ ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆమె నటించిన రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్ 2, సినిమాలు మంచి విజయం సాధించాయి. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలైన మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది ఈ ముద్దుగుమ్మ. నేడు తన 26 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 5, 2021 / 05:28 PM IST
    Follow us on

    F3 Movie: “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. మొదటి చిత్రంతోనే మంచి హిట్ సాధించిన ఈ భామ ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆమె నటించిన రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్ 2, సినిమాలు మంచి విజయం సాధించాయి. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలైన మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది ఈ ముద్దుగుమ్మ. నేడు తన 26 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మెహరీన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించి సినిమా నుంచి ఓ అప్డేట్‌ ప్రకటించింది ఎఫ్ 3 కిత్ర బృందం.

    విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఎఫ్‌ 3. ఈ సినిమా ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా మెహరీన్ నటిస్తుంది. కాగా ఈ అందాల రాశి పుట్టిన రోజు కానుకగా  ఓ పోస్టర్‌ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.  ఈ పోస్టర్ లో తన క్యూట్ లుక్స్ తో మెహరీన్ అభిమానులను అలరిస్తుందని చెప్పాలి. ఈ ఎఫ్‌ 3 సినిమా దాదాపు 80 కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తుండగా… దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    ఎఫ్‌ 3 సినిమా షూటింగ్‌ కూడా చివరి దశకు వచ్చేసింది.  వచ్చే ఏడాది  ఫిబ్రవరి 25 వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నారు.  మెహరీన్ ఇటీవల సంతోష్‌ శోభన్‌ తో కలిసి నటించిన “మంచి రోజులు వచ్చాయి”  సినిమా దీపావళి కానుకగా విడుదల అయ్యి… మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.