Divya Bharathi And Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న కమెడియన్స్ లో ఒకరు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer). పేరుకే కమెడియన్ కానీ, ఒక హీరో కి ఉండాల్సిన లక్షణాలు మొత్తం ఇతనిలో ఉన్నాయి. అందుకే సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత విడుదలైన ‘గాలోడు’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత సుధీర్ మొదలు పెట్టిన ‘GOAT’ చిత్రం పై మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రం నుండి విడుదలైన ‘అయ్యో పాపం సారూ’ పాట పెద్ద హిట్ అయ్యింది. అలా మంచిగా వెళ్తున్న ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నరేష్ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో కొంతకాలం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ఎట్టకేలకు ప్యాచ్ వర్క్ ని ముగించి రీసెంట్ గానే షూటింగ్ ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీజర్ ని విడుదల చేయగా, ఆడియన్స్ నుండి మనంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ తో నిర్మాతకు గొడవలు ఏర్పడడం, ఆ తర్వాత డైరెక్టర్ రీసెంట్ గా విడుదలైన సాంగ్ ప్రోమో ని ట్రోల్ చేయడమే కాకుండా, అందులో హీరోయిన్ గా నటించిన దివ్య భారతి ని ‘చిలకా’ అని సంబోధించడం వంటివి ఈమధ్య కాలం లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే రీసెంట్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ దివ్య భారతి సుధీర్ తో ఉన్న గొడవల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘ డైరెక్టర్ నరేష్ రీసెంట్ గా విడుదలైన మా సాంగ్ ప్రోమో ని వెక్కిరిస్తూ, నన్ను కూడా తక్కువ చేసి మాట్లాడాడు. చిలకా అనే పదం మంచిది అనేది నాకు తెలుసు. కానీ అతను ఏ ఉద్దేశ్యంతో ఆ పదాన్ని ఉపయోగించాడో నాకు తెలియదని అనుకుంటే ఎలా. అందుకే నేను నా ఆత్మాభిమానం కోసం ప్రశ్నించాను, ఎవ్వరూ సపోర్ట్ రావాలని కూడా కోరుకోలేదు. సుధీర్ గారితో సమస్య ఏంటంటే, ఆయనకు డైరెక్టర్ నరేష్ మంచి స్నేహితుడు. జరుగుతున్నది మొత్తం ఆయనకు తెలుసు. ప్రస్తుతానికి ఆయన ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అందులో ఐటెం సాంగ్ కోసం నన్ను ఆ చిత్ర నిర్మాత సంప్రదించాడు. ఇది సుధీర్ చెప్తేనే ఆ నిర్మాత చేసాడు. జరుగుతున్నా గొడవ మొత్తం అతనికి తెలిసి కూడా నన్ను గెలుకుతున్నట్టు అనిపించింది. డైరెక్టర్ నాపై సెట్స్ లో కామెంట్స్ చేస్తున్నప్పుడు సుధీర్ నాకు సపోర్ట్ గా అసలు రాలేదు’ అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది.