TANA Cultural coordinator Dr. Uma Katiki : ‘ప్రార్థించే పెదవుల కన్నా చేసే సాయం మిన్న’ అన్నారు పెద్దలు.. ఈ సత్యాన్ని అక్షరాల పాటిస్తున్నారు తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డా. ఉమా కటికి (ఆరమండ్ల) గారు. తల్లిదండ్రులు చూపిన బాటలో పేదలకు ఏదైనా చేయాలనే తలంపుతో ఈ సామాజిక సేవకు పూనుకున్నారు. ప్రతినిత్యం సేవ చేస్తూ అందరి మనసులు చూరగొంటున్నారు. ఉమా గారి సేవకు మెచ్చి తానాలోనూ ఆమెకు విజయాలు దక్కాయి. ఆ సేవాతత్పరతను కొనసాగిస్తూ ఉమాగారు ముందుకు సాగుతున్నారు.

తాజాగా అమెరికాలో తానా మరియు ‘లీడ్ ద పాత్ ఫౌండేషన్’ కలిసి.. ఉమా కటికి ఆధ్వర్యంలో ఈనెల 13న శనివారం పేదలకు బ్రౌన్ బ్యాగ్ లంచెస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ ఫుడ్ డ్రైవ్ ఉమా అండ్ టీం విజయవంతంగా పూర్తి చేసి పేదల ఆకలి తీర్చారు. బ్రౌన్ బ్యాగ్ లంచెస్ వాలంటీర్లతో కలిసి పేదలకు పంపిణీ చేసేందుకు స్వయంగా ప్యాక్ చేశారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వచ్చి వీటిని ట్రక్ లో తీసుకెళ్లి పేదలకు పంచారు.

ఈ బ్రౌన్ బ్యాగ్ లంచెస్ పంపిణీ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా సాగింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది తమ సహాయ సహకారాలు అందజేశారు. పలువురు దాతలు కూడా ముందుకొచ్చి సహాయం అందించారు. స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్లు తీసుకెళ్లి పేదలకు పంచి వారి కడుపు నింపడంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయ్యింది. ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తున్న ఉమా అండ్ టీంను ప్రవాసులు అభినందనలతో ముంచెత్తారు. మరింతగా సామాజిక సేవల్లో పాల్గొనాలని వీరి సేవలను కొనియాడారు.

ఈ ఫుడ్ ప్యాకేజింగ్ కి గౌరీ అద్దంకి , రాధిక గరిమెల్ల, అనిత కాట్రగడ్డ, దేవి తాడేపల్లి, శోభారాణి దొరస్వామి, ఇషా, అనిక, గురుప్రీత్ సింగ్, సంధ్య అద్దంకి, సోనా దేవరకొండ, శ్రేయా దేవరకొండ, శియా అద్దంకి, శిరీష సజ్జ, తులసీ, భవానీ చిరు, సుహాసినీ, నాగవాణి శనక్కాయల, మరియు మాధవి బత్తుల పాల్ొని విజయవంతం చేశారు.


