KGF Chapter 2: ‘కేజీఎఫ్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. నేడు యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు `కేజీఎఫ్’ లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ అంచనాలను అందుకుంది. పోస్టర్ లో డేంజర్ బోర్డులు పెట్టి.. వాటి వెనుక యష్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. రాకీతో పెట్టుకుంటే మీకు డేంజర్ తప్పదు అన్నట్టు పోస్టర్ ను డిజైన్ చేయడం చాలా బాగుంది.

Also Read: స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ కొత్త అవతారం?
‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. కారణం.. దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. అందుకే, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నేషనల్ స్టార్ అయ్యాడు. ఇక ఈ సినిమా సీక్వెల్ పై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు. కాకపోతే కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వాలి. కచ్చితంగా సోలో రిలీజ్ డేట్ ఉండాలి. సో.. సోలో డేట్ కోసం ‘కేజిఎఫ్ 2’ మేకర్స్ పక్కా ప్లాన్ తో ముందుకు పోవాలి. ఇక కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. అందుకే మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉండబోతున్నాయి. ఇక నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న యష్ పుట్టినరోజు. శుభాకంక్షాలు.
Also Read: సోనూసూద్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే !