
గత కొంత కాలంగా తమిళనాడులో భారీగా పెరుగుతన్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు అమలులో ఉంటుందని వెల్లడించింది. కిరాణ, కూరగాయలు, మాంసం దుకాణాలు, ఫార్మాసీ దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపింది.