Bujji Ila Ra Movie: చిన్న షోస్ నుండి సినిమాల వరకు కామెడీయన్ గా పేరు పొందిన వారిలో లో ధన్‌రాజ్ ఒకరు. అలాగే స్టార్ కమెడియన్ సునీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘బుజ్జీ ఇలా రా’. ఈ చిత్రానికి డైరెక్టర్ అంజి దర్శకుడిగా పని చేస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో… కిడ్నాప్ ల చుట్టూ ఈ కథ తిరుగుతుందని అర్దం అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చాందిని అయ్యంగార్ నటిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సినిమా ప్రొడ్యూసర్లు అగహ్రారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి మాట్లాడుతూ … కామెడీ, సస్పెన్స్ గా చిత్రిస్తున్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. టాటా బిర్లా మధ్యలో లైలా నుంచి గరుడవేగ సినిమాలకు సినిమాటోగ్రఫి చేసిన అంజి… ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడం ఈ సినిమాకి మరో ఆకర్షణ అన్నారు. ఈ చిత్రానికి సాయికార్తీక్ అద్బుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు.
కేవలం 45 రోజుల్లో సినిమాను పూర్తి చేశామని … సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డామని ధన్‌రాజ్ తెలిపారు. ‘బుజ్జి ఇలా రా ‘ సినిమా ప్రేక్షక అభిమానులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సునీల్ , ధనరాజ్ కాంబో లో ఉన్న సీన్లు ఆడియన్స్ కు మంచి కామెడీ అందిస్తాయని తెలిపారు. అలాగే సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషించిన సునీల్… పుష్ప సినిమాలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారని వివరించారు. ప్రస్తుతం ఈ టీజర్ కు సోషల్ మీడియా లో మంచి వ్యూస్ లభిస్తున్నాయి .
https://youtu.be/j3xDCQ1Ir6U
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bujji ila ra movie teaser released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com