HomeNews Retirement Age Increased:  నాడు లేచిన నోర్లు నేడు మూగబోయాయి.. ఉద్యోగుల వయోపరిమితి 65 ఏళ్లకు...

 Retirement Age Increased:  నాడు లేచిన నోర్లు నేడు మూగబోయాయి.. ఉద్యోగుల వయోపరిమితి 65 ఏళ్లకు పెంచినా బీజేపీ మౌనం!

Retirement Age Increase: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. అందరూ ఊహించినట్లుగానే బాంబు పేల్చింది. రిటైర్మెట్‌ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఉద్యోగులెవరూ తమ రిటైర్మెంట్‌ వయసు పెరగాలని కోరుకోవడం లేదు. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు వేతన బకాయిలు, ఫీఎఫ్, గ్రాట్యుటీ డబ్బులు చెల్లించే పరిస్థితి లేక.. వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ కూడా బీఆర్‌ఎస్‌ కన్నా తాము తక్కువ కాదు అన్నట్లు మరో మూడేళ్లు కలిపి మొత్తం 60 నుంచి 65 ఏళ్లకు రిటైర్మెంట్‌ వయసు పెంచింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీవో 3 విడుదల చేసింది. జీవో విడుదల చేసిన తర్వాత రెండు రోజులకు విషయం వెలుగులోకి వచ్చింది.

బకాయిలు చెల్లించలేక..
గత బీఆరెస్‌ ప్రభుత్వం కూడా రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును రెండేళ్లు పెంచింది. అప్పటి వరకు 58 ఏళ్లుగా ఉన్న రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లకు పెంచింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే బాటలో 60 నుంచి 65 ఏళ్లకు ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ యవసు పెంచింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంచినప్పుడు విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ గగ్గోలు పెట్టాయి. రిటైర్మెంట్‌ వయసు పెంచడానికి కారణాలు చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశాయి. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. రిటైర్మెంట్‌ వయసు పెంచింది. నిలదీయాల్సిన, ప్రశ్నించాల్సిన బీజేపీ మౌనంగా ఉంది. ఇక బీఆర్‌ఎస్‌ గతంలో అదే పొరపాటు చేసింది. కాబట్టి ఇప్పుడు స్పందించడం లేదు. కానీ బీజేపీ మౌనంగా ఉండడం మిమర్శలకు తావిస్తోంది. నాడు నిరుద్యోగులు కూడా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగుల వయసు పెంచడాన్ని తప్పు పట్టారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ అదే తప్పు.. కాదు కాదు.. అంతకన్నా ఎక్కువ తప్పు చేసింది. అయినా విపక్షాలతోపాటు నిరుద్యోగులు కూడా మౌనం వహిస్తున్నారు.

ప్రొఫెసర్ల ఆందోళన..
ఇదిలా ఉంటే.. రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా నిరసన చేపట్టారు. అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. రిటైర్మెంట్‌ యవసు పెంచింది. ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రేపు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్ల రిటైర్మెంట్‌ వయసు కూడా పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణంౖయె ప్రొఫెసర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

విపక్షాల మౌనం..
ఇక రిటైర్మెంట్‌ వయసు పెంపుపై విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మాత్రం మౌనం వహిస్తునానయి. ఇలాంటి నిర్ణయాలు ఏమాత్రం మంచివి కావు. ఈ విషయం విపక్ష నేతలకు తెలుసు. ఇలా వయసు పెంచుకుంటూ పోతే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. లక్షల మంది నిరుద్యోగుల అర్హత వయసు దాటిపోతోంది. నోటిఫికేషన్లు నిలిచిపోతాయి. కొత్త నియామకాలు జరగవు. అయినా ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడాన్ని విశ్లేషకుల తప్పు పడుతున్నారు.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Exit mobile version