https://oktelugu.com/

Astrology: ఈ రెండు గ్రహాల కలయిక.. మూడు రాశుల వారికి ఇక తిరుగేలేదు

సాధారణంగానే గ్రహాలు మారుతుంటాయి. వీటివల్ల రాశుల్లో మార్పులు వస్తాయి. వాటికి కొత్త సంవత్సరం అలా ఏం ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఏ మూడు రాశుల వారికి తిరుగుఉండదో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2024 / 05:30 AM IST

    Astrology

    Follow us on

    Astrology: ఇంకో పది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది. అయితే గ్రహాల మార్పుల వల్ల 2025 సంవత్సరం ప్రారంభంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల మూడు రాశులకు రాజయోగం రాబోతుంది. కొన్ని రాశులు ఒక్కోసారి వేరే ఇతర రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో గ్రహాల కలయిక మారుతుంది. దీనివల్ల మూడు రాశులకు అదృష్టం రాబోతుంది. నిజానికి ఇది తెలుగు వారి కొత్త సంవత్సరం కాదు. అయిన కూడా ఈ మార్పులేంటి అని అనుకోవచ్చు. సాధారణంగానే గ్రహాలు మారుతుంటాయి. వీటివల్ల రాశుల్లో మార్పులు వస్తాయి. వాటికి కొత్త సంవత్సరం అలా ఏం ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఏ మూడు రాశుల వారికి తిరుగుఉండదో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    మేషం
    శని, బుధ గ్రహాలు కలుస్తున్నాయి. వీటివల్ల మేష రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అన్ని జరుగుతాయి. అలాగే వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త వ్యాపారాలు ఏవైనా ప్రారంభించిన మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఏర్పడతాయి. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బుకు కొరత ఉండదు. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఏ పని ప్రారంభించిన ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరుగుతుంది.

    కుంభం
    కుంభ రాశి వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డబ్బు, ఆనందంతో చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఇకపై సరైన సమయం అని చెప్పవచ్చు. అన్ని విధాలా ఆనందంగా ఉంటారని వేద పండితులు చెబుతున్నారు.

    మీనం
    మీన రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తే కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సంపదలో పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి లాభం వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలున్నాయి. ఈ ఏడాది మీరు డబ్బులు ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు నెరవేరుతాయి. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. కన్న కలలన్నీ సాకారం అయ్యే సమయం వచ్చింది. జీవితం విలాసవంతంగా ఉంటుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. మీ సంపద కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.