
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజుతో పోల్చితే తాజాగా కొత్త కేసులు, మరణాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. నిన్న 18, 43,500 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 41,506 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక మరణాల సంఖ్య కాస్త తగ్గింది. అంతకుముందు రోజు 1200 మరణాలు నమోదు కాగా తాజాగా 895 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 4,08,040కి చేరింది.