
ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలుపుతామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2022 శాసనసభ ఎన్నికలకు ముందు జరిగే పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలుపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆజాద్ పేర్కొన్నారు. ఇటీవల దళిత గ్రామంలో హత్యకు గురైన వ్యక్తికి సాయం అందించడంలో నిర్లక్ష్యం జరుగుతున్నది మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ను కలిశారు.