
కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం చాలాకాలమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలోని ప్రముఖులంతా ఇతర పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్ శివనసేన పార్టీలో చేరనుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. దీంతో ఆ ఎన్నికల అనంతరం గత సెప్టెంబర్ లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది. అయితే కాంగ్రెస్ లో కొన్ని విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నట్లు ఊర్మిళ తెలిపారు. ఆ పార్టీలో పెద్ద లక్ష్యం కోసం పనిచేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు చేసుకోవడానికే సమయం సరిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలం దక్షిణాది సినీ నటి ఖుష్బూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఊర్మిళ మాత్రం శివసేన పార్టీని ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.