
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను చంపేస్తామంటూ పోస్టర్లు వెలిశాయి. ఆయనను చంపిన వారికి పది లక్షల డాలర్లు ఇస్తామని మొహాలీ వీధుల్లో ఓ పోస్టర్ పెట్టారు. అయితే కొందరిపై పోలీసులుకేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా గత నెల 31న ఈ పోస్టర్ అంటించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.