
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తీసుకురావడంతో దేశీయ శాస్త్రవేత్తలు ఎంతో క్రుషి చేశారని, వారిని చూసి దేశం గర్వపడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఆయన మెట్రాలజీ కాంక్లేవ్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్ లో ప్రారంభం కానుందన్నారు. అయితే మనం తయారు చేసే ఉత్పత్తులు ఎంత ముఖ్యమో వాటిని నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. ఇక ప్రపంచ స్రుజనాత్మక ర్యాంకింగ్స్ లో భారత్ టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలిచిందని, పరిశ్రమ, సంస్థల మధ్య సహకారం ఉంటే మరింత ముందుకు వెళ్తామన్నారు.