
ఢిల్లీ ప్రజలను చలి వణికిస్తోంది. దట్టమైన పొగమంచు ఢిల్లీ నగరాన్ని కమ్మేసింది. న్యూఇయర్ రోజున ఢిల్లీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సరిగ్గా 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో 1.1 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 2006, జనవరి 8వ తేదీన 0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గతేడాది జనవరిలో అత్యల్పంగా 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇవాళ ఉదయం ఢిల్లీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కమ్మేసింది. దాంతో పాటు చలి తీవ్రత కూడా బాగా పెరిగింది.