
కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనతో రాష్ట్రంలో కలకలం రేపింది. యడ్యూరప్ప రాజకీయ కార్యదర్శి అయిన ఎన్ఆర్ సంతోష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య మెమోరియల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థతిని బాగానే ఉందని వైద్యలు తెలిపారు. కాగా సమచారం తెలుసుకున్న సీఎం, సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.