
టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ నటులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజగా దర్శకుడు శ్రీనువైట్ల విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రముఖ సినీ నటుడు సోనూసుద్ స్వీకరించాడు. కరోనా లాక్‌డౌన్‌లో ఎంతో మంది పేదలను ఆదుకొని రియల్ హీరో అయిన సోనూసుద్ తన ఇంటి ఆవరణలో మొక్కను నాటి అందరినీ మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
Also Read: అన్ లాక్ 5.0: సినిమా హాళ్లు తెరుచుకోబోతున్నాయ్..?