
కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మేరకు ట్రేడ్ అసోసియేషన్ ‘అసెచామ్’ రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిచో తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు నిరసనల కారణంగా రవాణాకు అంతరాయం కలిగి రోజుకు రూ.3,000 నుంచి 3,500 కోట్ల వరకు ఆర్థిక నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా వ్యవసాయం, హార్టికల్చర్ పై ఆధారపడిన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రద్ లో తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. రైతుల ఆందోళన, రైల్వేల నిర్బంధాల కారణంగా ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడిందని అసోచామ్ అధ్యక్షుడు నిరంజన్ హీరానంద తెలిపారు. ప్రస్తుత క్రిస్మస్ సందర్భంగా వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యను త్వరగా పరిష్కరించాలని లేకపోతే తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు.