
కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనలో భాగంగా సోమవారం సింఘ, టిక్రి, ఘాజిపూర్, చిల్లా సరిహద్దుల్లో చలిని సైతం లెక్క చేయకుండా రైతులు ధర్నాకు దిగుతున్నారు. వీరికి మద్దతుగా పలు సంస్థలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆయా సంస్థలు రైతులకు అవసరమయ్యే వాటర్ హీటర్లు, వాషింగ్ మెషిన్లు, రోటీ మేకర్లు, చార్జింగ్ పాయింట్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. కాగా రేపు ఉదయం 11 గంటలకు రైతులతో ప్రభుత్వం చర్చలకు పిలిచిన విషయం తెలిసిందే.