
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ భౌతికాయానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం నివాళులర్పించారు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటన్నారు. అసోం గురించి ఎవరూ చెప్పలేనంత అంతంగా నాకు చెప్పారని తెలిపారు. అసోం ప్రజల సంస్కృతి గురించి కూడా అంతే అంతంగా వివరించారు. నన్ను ఓ కుమారుడిగా భావించారు అని రాహుల్ పేర్కొన్నారు. అసోం రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారన్నారు.