
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. ఆమె 103వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఢిల్లీలోని శక్తస్థల్ లో ఉన్న ఇందిరాగాంధీ సమాధికి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారానికి ప్రతిరూపమైన అమె సమర్థవంతమైన ప్రధాన మంత్రి అయిన రాహుల్ కొనియాడారు. ఆమె నేర్పిన విషయాలు తనను ప్రతిరోజు ప్రేరేపిస్తాయని రాహుల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. కాగా ఇందిర జయంతి సందర్భంగా రాహుల్ ఆమె బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్టు చేశారు. ఇది వైరల్ గా మారుతోంది.