
కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో నిర్వహిస్తున్న రైతుల నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. చలిని సైతం లెక్క చేయకుండా రైతులు ఆందోళన చెందుతున్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా దేశ రాజధాని సింఘు సరిహద్దులో రైతులు సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. భేటీ తరువాత తదుపరి కార్యక్రమాలపై వివరించనున్నారు. ఈ ఆందోళనలో పంజాబ్, హర్యానా,ఉత్తరప్రదేశ్ రైతులు సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు.