
బీహార్ రాష్ట్రంలో 94 స్థానాలకు రెండో విడత పోలింగ్ మంగళవారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 17 జిల్లాల పరిధిలోని 1,463 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా ముజఫర్ పూర్ జిల్లా బరురాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌల్హాయీ బిషూన్ పూర్ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామ అభివవ్రుద్ధిని ఎవరూ పట్టంచుకోలేదని నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 729 ఓట్లు ఉండగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. దీంతో పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. మరోవైపు నేడు జరిగే పోలింగ్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.