
మహారాష్ట్రలో వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ ముందే కసరత్తు మొదలు పెట్టింది. మహా వికాస్ అగాదీ (ఎంవీఏ) కూటమి పక్షాలన్నీ ఏకమైతే బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్సీపీ, శివసేన పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ 13 మందితో ఎన్నికల నిర్వహణ, పరిశీలకుల కమిటీ ఏర్పాటు చేశారని ఇవాళ కాంగ్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. నవీ ముంబై, ఔరంగాబాద్, వాసాయ్ విహార్, కళ్యాణ్, దోంబివ్లీ, కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది.