ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా హర్యానా ఎమ్మెల్యే సొంబిర్ సంగ్వాన్ హర్యానా లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు అందించారు. సంగ్వాన్ స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొంది బీజేపీకి కూటమికి మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఈ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన నియోజకవర్గమైన దాద్రి రైతులు కూడా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారన్నారు. దీంతో వారికి మద్దతు తెలపడమే సరైన నిర్ణయమని పేర్కొన్నారు.