
పంజాబ్‌కు చెందిన శౌర్యచక్ర అవార్డు గ్రహీత బల్వీందర్ సింగ్‌ను శుక్రవారం గుర్తు తెలియని కొందరు కాల్చి చంపారు. తన ఇంటిని ఆనుకొని ఉన్న కార్యాలయంలో ఉన్న బల్విందర్ సింగ్‌ను ఇద్దరు ద్విచక్రవాహనంపై వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు. పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లా భికివింద్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. భారత ఆర్మీలో పనిచేసిన బల్విందర్ సింగ్ సేవలకు గుర్తింపుగా 1993లో రక్షణ శాఖ ఆయనకు శౌర్యచక్ర బిరుదుతో అస్కరించింది. ఆయన ధైర్య సహాసాలపై పలు డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. ఇదివరకే ఉగ్రవాదులతో ముప్పు ఉందని గ్రహించిన ప్రభుత్వం ఇటీవల స్థానిక పోలీసల సిఫారసు మేరకు భద్రతను తొలగించిందని బల్వీందర్‌సింగ్ బంధువు తెలిపారు.