సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్ లో ఆసీస్ చేతిలో భారత్ పరాజయం చెందింది. ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేయగా భారత్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగుల వద్ద 50 ఓవర్లు పూర్తి చేసింది. భారత్ ఓటమిపై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు రావడంతో టీమిండియా జట్టు కెప్టెన్ స్పందించాడు. చాలా రోజుల తరువాత వన్డే మ్యాచ్ ఆడామన్నారు. దీంతో 25 ఓవర్ల తరువాత మా బాడీ లాంగ్వేజ్ సరిగా లేపోవడంతోనే స్కోరు చేయలేకపోయామన్నారు. దురద్రుష్టవశాత్తూ హార్థిక్ పాండ్యా బౌలింగ్ చేసేందుకు ఫిట్ గా లేడన్నారు. అలాగే మాకు ఆల్ రౌండర్ కొరత ఏర్పడిందని కోహ్లి చెప్పారు.