
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. దీంతో ముగ్గురు సాధారణ పౌరులు గాయపడ్డారు. బారాముల్లా జిల్లాలోని పటాన్ సమీపంలో ఉన్న సింఘ్‌పొరా వద్ద ఇవాళ ఉదయం ఉగ్రవాదులు భద్రతా బలగాల కాన్వాయ్‌పై గ్రెనేడ్ విసిరారు. అయితే అది గురితప్పి రోడ్డు పక్కన పేలడం ముగ్గురు సాధారణ పౌరులు గాయపడ్డారు. వారిని పటాన్‌లోని దవాఖానకు తరలించామని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.