
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు ముందుగా చెప్పటినట్టుగానే ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించారు. నోయిడా సమీపంలోని మహా మాయ ఫ్లై ఓవర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ చిల్లా సరిహద్దు వరకు కొనసాగనుంది. నోయిడా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీకి భారతీయ కిసాన్ యూనియన్ ముందుండి నడిపిస్తోంది. రైతుల ట్రాక్టర్ ర్యాలీ నేపధ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల రైతుల ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు రైతు సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.