Homeజాతీయం - అంతర్జాతీయంకరోనాతో ప్రధాని మృతి

కరోనాతో ప్రధాని మృతి

కరోనా వైరస్ నిరోధానికి ఓ పై వ్యాక్సిన్ పంపిణికి సిద్ధమవుతున్నా మరో వైపు ఆ వైరస్ తో మరణాలు ఆగడం లేదు. ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులను బలి తీసుకున్న కరోనా తాజాగా ఓ ప్రధాని ప్రాణాలు తీసింది.  ఎస్వాతీనీ అనే దేశ ప్రధాన మంత్రి కరోనాతో మరణించారు. నాలుగు వారాల కిందట కరోనా బారిన పడ్డ అంబ్రోస్ మాండ్వులో లామిని చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎస్వాతీనీ దేశ ఉప ప్రధాని థెంబా మసుకు వెల్లడించారు. కరోనా సోకిన సమయంలో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అయితే రాను రాను పరిస్థితి విషమించడంతో దక్షిణాప్రికాకు తరలించామన్నారు. ఈనెల 1 నుంచి ఆయన అత్యవసర చికిత్స పొందారని, ఆదివారం అర్ధరాత్రి మరణించినట్లు థెంబా పేర్కొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular