Homeజాతీయం - అంతర్జాతీయండీఆర్‌డీవో విజయాలు దేశానికి గర్వకారణం : రాజ్‌నాథ్ సింగ్

డీఆర్‌డీవో విజయాలు దేశానికి గర్వకారణం : రాజ్‌నాథ్ సింగ్

రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్‌డీవో) సాధిస్తున్న విజయాలు మన దేశానికి గర్వకారణమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. స్వయంసమృద్ధ భారత్ నిర్మాణం కోసం ఈ సంస్థ అసాధారణ సాంకేతిక విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. డీఆర్‌డీవో 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 2021లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీఆర్‌డీవో దేశానికి ఓ వాగ్దానం చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆధునిక డిఫెన్స్ టెక్నాలజీస్, సిస్టమ్స్‌ను అభివృద్ధిపరచి, దృఢ నిశ్చయంతో దేశాన్ని స్వయం సమృద్ధం చేస్తామని మరోసారి పేర్కొంది. పరిశోధన, డిజైన్, అభివృద్ధి, సృజనాత్మకత ప్రస్థానాన్ని కొనసాగిస్తామని తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular