Domestic Markets In Loss: ముంబై : బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల మధ్య దేశీయ మార్కెట్లు శుక్రవారం ఆరంభంలోనే నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్ల నష్టంతో 57,300 వద్ద కదలాడుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 186పాయింట్ల నష్టంతో 17,200 వద్ద కొనసాగుతోంది. దీంతో మార్కెట్ లోని పలు కంపెనీల షేర్లు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది . సెన్సెక్స్‌లో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ 1.6శాతం అత్యధికంగా లాభపడగా.. టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 2.2శాతం క్షీణించగా, బజాజ్ ఆటో, హెచ్‌డిఎఫ్‌సి అత్యంత నష్టాల్లో కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 53 ఐపీఓలు జరిగాయి. రెయిన్‌బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్..ఏప్రిల్ 27 నుంచి ఐపీవోకి రాబోతోంది. షేర్ల విక్రయం ద్వారా రూ.2 వేల కోట్ల నిధులను సేకరించాలనే సంకల్పంతో మూడు రోజులపాటు వాటాలను విక్రయించనుంది. ఏప్రిల్29న ఈ ఐపీవో ప్రక్రియ ముగియనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఏప్రిల్ 26ని రిజర్వు చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.280 కోట్ల నిధులను సమీకరించనున్న సంస్థ..2.4 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్‌లో విక్రయించనుంది. అర్హులైన ఉద్యోగులకు 3 లక్షల షేర్లను కేటాయించింది. ప్రస్తుతం కంపెనీకి 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్‌లు ఉన్నాయి. లీడ్ మేనేజర్లుగా కొటాక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, జేపీ మోర్గాన్ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీలు వ్యవహరిస్తున్నాయి. ఈక్విటీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌కానున్నాయి.

Recommended Videos: