
ప్రధాని మోడీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రధాని రేడియోలో ప్రసంగం సాగినంతసేపు రైతులు తలెల చప్పుళ్లు చేస్తూ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కాగా రైతులు చేస్తున్న ఆందోళన ఆదివారంతో 32వ రోజుకు చేరుకుంది. ఈనెల 29న రైతులతో ప్రభుత్వం చర్చలు ఆహ్వానించగా షరతులతో అంగీకరించిన విషయం తెలిసిందే.