
కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులపై పంజా విసురుతుంది. ఇప్పటికే గోవా, మేఘాలయ ముఖ్యమంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవల ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ నిర్దారణ అయింది. ప్రస్తుతం త్రివేంద్ర సింగ్ రావత్ ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు అస్వస్థతకు గురైతే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక పరిపాలనకు సంబంధించిన విషయాలు ఇంటి నుంచే నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
"Uttarakhand Chief Minister Trivendra Singh Rawat tests positive for #COVID19", tweets Uttarakhand CM. pic.twitter.com/mELVwgzU1x
— ANI (@ANI) December 18, 2020