
దేశంలో కరోనా ప్రారంభమై ఏడాది అవుతోంది. ఇప్పటి వరకు మొత్తం 90 లక్షల కేసులు దాటాయి. ప్రారంభంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా.. ఆ తరువాత విపరీతంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 45,882 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 491 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,04,366 గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,32,162 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,43,794 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 84,28,410 గా ఉంది. గత పది రోజులుగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.