
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తల్లి మంగళవారం కన్నుమూశారు. పళనీస్వామి తల్లి థవాసాయి అమ్మాల్‌కు 93 ఏళ్లు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో సేలంలోని ఓ ప్రేవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న పళనీస్వామి చెన్నై నుంచి సేలంకు వచ్చారు. అలాగే ఆయన కన్యాకుమారి, విరుద్‌నగర్, తూటి కోరిన్ పర్యటనను రద్దు చేసుకున్నారు.అమ్మాల్ అంత్యక్రియలు జిల్లాలోని శిలువంపాళయం గ్రామంలో నిర్వహించనున్నారు. కాగా సీఎంకు ప్రముఖుల సంతాపం తెలిపారు.