
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతున్నా రాజధానిలో మాత్రం కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. దీంతో ఇప్పటికే మార్కెట్ల బంద్ కోసం అనుమతికి సీఎం కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు సైతం బహిరంగ ప్రదేశాల్లో ఛట్ పూజలకు అనుమతి లేదంటూ కోర్టు స్పష్టం చేసింది. కరోనా తీవ్రత పెరుగుతున్నందున అంతకుముందు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ చైర్మన్ ఛట్ పూజలకు అనుమతి లేదంటూ ఉత్తర్వుల జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు.బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం దానిని కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అనర్హ మైనదనదని తెలపింది.