
దేశవ్యప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయనుకున్నా మరణాలు మాత్రం ఆడగడం లేదు. కరోనా వైరస్ తో ఇప్పటికే కేంద్రమంత్రులు, మంత్రులు, ఎమ్మల్యేలు మరణించారు. తాజాగా ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందారు. సాల్ట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కు గత కొద్దిరోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆయన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల కిందట ఆయన భార్య కూడా గుండెపోటుతో మరణించారు. కాగా సురేంద్రసింగ్ మరణంతో బీజేపీ నాయకులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.