
ఒడిశాకు చెందిన బీజేడి ఎమ్మెల్యే ప్రధీప్ మహారథి మృతి చెందారు. ఆయనకు కరోనా వైరస్ సోకడంతో గత నెల 14 నుంచి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంలో శుక్రవారం నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తునానరు. ఆదివారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. పూరీ జిల్లాలోని పిపిలీ నియోజకవర్గం నుంచి ప్రదీప్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు రాష్ట్ర మంత్రలు, ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: కరోనా నుంచి కోలుకొనే పరిస్థితి లేదా?