
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనలో భాగంగా మంగళవారం భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చారు. అయితే బుధవారం రైతులతో చర్చలు జరగాల్సి ఉండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒకరోజు ముందుగానే అంటే నేటి సాయంత్రం చర్చలు జరిపేందుకు రైతులను ఆహ్వానించారు. దీంతో సాయంత్ర 7 గంటలకు రైతులు అమిత్ షాను కలవనున్నారు. మరోవైపు భారత్ బంద్ దేశ వ్యాప్తంగా విజయవంతం అయింది. దాదాపు అన్ని రాష్ట్రల్లోనూ రైతులకు మద్దతు పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.