
ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో 25 మందికి గాయాలైన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. పూల్వాని నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు కందమూల్ జిల్లాలోని గడియాపాడఘాట్ వద్ద శుక్రవారం అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 40 మంది ఉండగా 25 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.