
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,53,807కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 918 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,08,334కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,67,496 యాక్టివ్ కేసులు ఉండగా.. 60,77,977 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.