
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 38,617 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 474 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 89,12,908 గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,30,993 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,46,805 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 83,35,110 గా ఉంది. గత పది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడి ఒక్కసారిగా పెరగడంతో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా నిన్న ఒక్కరోజే 9,37,279 కరోనా పరీక్షలు చేశామని ఐసీఎంఆర్ తెలిపింది.