Banana Farming: మనం తినే పండ్లల్లో అత్యంత ఆరోగ్యకరమైన ఫ్రూట్ ఏదంటే అరటిపండు అని చెప్పొచ్చు. భారతదేశంలో మామిడి తరువాత ఆదరణ పొందే పండ్లలో అరటి ఒకటి. సంవత్సరం పొడవునా.. ఏ సమయంలోనైనా మార్కెట్లో దొరికే అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా అరటిపండులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా తినాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. భారతదేశంలో ఎగుమతి అయ్యే పండ్లలో అరటి కూడా ఉంది. ఈ తరుణంలో మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా అరటిపండ్ల ఉత్పత్తి అవుతాయి. వాటిలో టాప్ 5 గురించి తెలుసుకుందాం.
తమిళనాడు:
భారతదేశంలో అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే మొదటి రాష్ట్రంగా తమిళనాడును చెప్పుకోవచ్చు. ఇక ప్రతీ సంవత్సరం 5 వేల మెట్రిక్ టన్నుల పైగానే పండుతుంది. 2020-21 సంవత్సరంలో 5136.2 మెట్రిక్ టన్నుల అరటిపండ్లు ఉత్పత్తి అయ్యాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువగా గ్రాండ్ నైనే, రెడ్ బనానా, పూవన్ రకాలను పండిస్తారు.
గుజరాత్:
తమిళనాడు తరువాత అరటిపండ్లను గుజరాత్ లో ఎక్కువగా పండిస్తారు. వీటి ఉత్పత్తికి ఇక్కడ అనువైన వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా అరటి పండ్లను ఉపయోగించే అనేక పదార్థాలను తయారు చేసే ఫ్యాక్టరీలు గుజరాత్ లోనే ఎక్కువగా ఉన్నాయి. రొబుస్తా, డ్వాప్ట్, కార్వేడిష్, జీ9, లాల్ వెల్చి అనే రకాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.
కర్ణాటక:
బనానా ప్రొడ్యూసింగ్ లో కర్ణాటక మూడో స్థానాన్నికలిగి ఉంది. ఇక్కడ 2020-21 ప్రకారం 3600 మెట్రిక్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేశారు. కల్టివేటింగ్ నేండ్రాన్, ఇలక్కి బాలే, ఎలక్కి, గ్రాండ్ నైనే అనే రకాలను కర్ణాటకలో పండిస్తారు.
బీహార్:
బీహార్ లోనూ అత్యధికంగా అరటిపంటను సాగు చేస్తారు. 2020-21 ప్రకారం 3247 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేశారు. మల్బోగ్, చినియా అనే రకాలు ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి.
పశ్చిమ బెంగాల్:
పశ్చిమ బెంగాల్ అరటిపండ్లకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పండినవి ఎక్కువ రుచిని ఇస్తాయని చాలా మంది నమ్మకం. 2020-21 ప్రకారం 2529. 6 మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో పండించారు.
Recommended Video: