Uber Cab : వాళ్లు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఇద్దరు. బిలియనీర్లు.. చిటికేస్తే.. కోట్లు విలు వచేసే సకల సౌకర్యాలు ఉన్న కార్లు వాళ్ల కాళ్ల వద్దకు వచ్చి ఆగుతాయి. కానీ ఆ ఇద్దరు ఉబెర్ వాహనంలో ప్రయాణించారు. ఊహకే అందని ఈ దృశ్యం అమెరికాలో ఆవిష్కృతమైంది. సంపన్న దిగ్గజాలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా వాషింగ్‌టన్ వీధుల్లో ఉబెర్ వాహనం కోసం పరిగెత్తడం, ఇంతలో వ్యోమగామి రావడం ఆసక్తిగా మారింది.
ప్రధాని డిన్నర్‌లో పాల్గొని..
ప్రధాని నరేంద్రమోదీ నాలుగు రోజుల పర్యటన కోసం ఇటీవల అమెరికా వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు మోదీ గౌరవార్థం స్వేత సౌధంలో గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. మోదీ వెంట పారిశ్రామిక దిగ్గజాలు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వైట్‌హైస్ తూర్పు గదిలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. శుక్రవారం ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీవైట్ హౌస్ తూర్పు గదిలో ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వంటి వారితో కలిసి భారత్–యూఎస్ హై–టెక్ హ్యాండ్‌షేక్ సమావేశంలో పాల్గొన్నారు.
చర్చల్లో ముగినిపోయి..
ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా యూఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో, థర్డ్ ఐటెక్ సహ–వ్యవస్థాపకురాలు వృందా కపూర్‌తో వ్యాపారం, పెట్టుబడుల విషయంలో చర్చలు జరిపారు. సుదీర్ఘ మంతనాల్లో నిమగ్నమైన వారు భోజనానికి వెళ్లాల్సిన సమయం కూడా మర్చిపోయారు. దీంతో వారు ప్రయాణించేందుకు న్పాటుచేసిన వాహనం వెళ్లిపోయింది. టైం ఫాలో అయ్యే అమెరికాలో.. ఎవరి కోసం ఏదీ ఆగదు. అంబానీ, ఆనంద్ మహీంద్రాతోపాటు అక్కడ ఉన్నవారంతా ప్రపంచంలోనే సంపన్నులు. అయినా వారి కోసం ఏర్పాటు చేసి వాహనం వారు వచ్చేదాకా వెయిట్ చేయాలేదు. టైం కాగానే వెళ్లిపోయింది.
ఉబర్ కోసం ప్రయత్నం..
మీటింగ్ తర్వాత టైం చూసుకునే సరికి వారి వాహనం వెళ్లిపోయందని అర్థమైంది. దీంతో వారు ఉబర్ కోసం ప్రయత్నించేందుకు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా వారికి భారత సంతతి వ్యోమగామి సునీతవిలిమ్స్ కనిపించింది. వెంటనే వారు అక్కడ ఆమెతో సెల్ఫీ దిగారు. ఈ పందర్భంగా వారు తాము బస్ మిస్ అయ్యామని, మీరు స్పేస్ షటిల్ వాహనంలో మమ్మల్ని భోజనానికి తీసుకెళ్తారా అని ఈ సందర్భంగా సునీత విలియమ్స్‌ను అడిగారు అంబానీ, ఆనంద్ మహీంద్ర. తర్వాత ట్యాక్సీలో వారు డిన్నర్‌కు వెళ్లినట్లు ఉన్నారు. అయితే ఈ విషయాని, సునీత విలియమ్స్‌తో దిగిన షెల్ఫీ ఫొటోను ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇదే అనుకుంటా వాషింగ్‌టన్ మూమెంట్ అంటే అని ట్యాగ్ చేశారు.