Oil Price: ప్రపంచంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుల కుటుంబంలో వచ్చే ఆదాయంలో 60 నుంచి 80 శాతం వరకు వీటి కోసమే వినియోగిస్తుంటారు. ఇప్పుడు ధరలు పెరగడంతో అప్పలు చేసి మరీ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నిత్యావసరాల ధరలు 7 నుంచి 63 శాతం పెరిగాయి. ధరలు విపరీతంగా పెరగడంతో రోజూవారీ కుటుంబ పోషణే కాకుండా కొన్ని శుభకార్యాలను చేయడం గగనంగా మారింది. ముఖ్యంగా వంట సామగ్రి రేట్లు అధికంగా ఉండడంతో పెళ్లిళ్ల ఖర్చు మోపెడవుతోంది. అయితే వంట సామగ్రిలో వినియోగించే ఆ వస్తువు ధరలు మెల్లమెల్లగా దిగుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్యలు తీసుకోవడంతో మరింత ఊరట కలిగించే అవకాశం ఉంది.
ప్రతీ ఇంట్లో.. ప్రతీ రోజూ అవసరమయ్యే వస్తువుల్లో వంట నూనె ఒకటి. 2020 సంవత్సరంలో వంటనూనె లీటర్ కు రూ.110 ఉండేంది. ఆ తరువాత 2021 మే నెలలో ఏకంగా రూ.175 పెరిగింది. ఆ తరువాత కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాటి ధరలు రూ.225 వరకు విక్రయించారు. ఇంత రేటు పెట్టి కొనలేని కొంతమంది ఫిల్టర్ ఆయిల్ నుంచి ఫామాయిల్ ను వాడడం మొదలు పెట్టారు. ప్రభుత్వాలు సైతం ఫామాయిల్ సాగును ఎంకరేజ్ సబ్సిడీని ఇస్తోంది. దీంతో ఇక రాను రాను ఫిల్టర్ ఆయిల్ వాడుతారా? అని అనుకున్నారు.
అయితే అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడడంతో నూనె ధరలు దిగుతూ వస్తున్నాయి. తాజాగా వంటనూనెల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కంపెనీలు 6 శాతం తగ్గించాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ఎంఆర్ పీ తగ్గించాలని తమకు తెలియజేసిందని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ (ఎస్ఈఏ) తెలిపింది. దీంతో దేశీయ మార్కెట్లోను నూనె ధరలు తగ్గనున్నాయి. బ్రాండెడ్ ఆయిల్ లీటర్ కు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించాలని విల్ మర్, జెమిని ఎడిబుల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం లీటర్ ఆయిల్ ప్యాకెట్ ను రూ.130 వరకు విక్రయిస్తున్నాయి. వీటి ధరలు మరి కొన్ని రోజుల్లోకి అందుబాటులో ఉంటాయి.
గత ఆరు నెలల కాలంగా అంతర్జాతీయంగా వంట నూనె ధరలు దిగుతూ వస్తున్నాయి. గత 60 రోజుల్లో మరింత తగ్గాయి. వేరు శెనగ, సోయాబిన్, మస్టర్స్ ఉత్పత్తి పెరుగుతుండడం మరింత ప్లస్ పాయింట్ గా మారింది. ఇటీవల శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది పెళ్లిళ్లు సెట్ చేసుకున్నారు. వంటనూనెల ధరల తగ్గింపుతో వారిలో కాస్త ఊరట లభించినట్లయింది. అయితే మిగతా వస్తువుల ధరలు తగ్గితే బావుండు అని అనుకుంటున్నారు. గత ఏడాది కాలంగా వంట నూనెల ధరలు తగ్గుతూ వస్తున్నాయి.